Friday, December 20, 2024

మహిళల సంక్షేమమే ధ్యేయంగా..

- Advertisement -
- Advertisement -

మానకొండూరు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సం క్షేమం కోసం చిత్తశుద్ధితో ఉందని వారి సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ మైదానంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా జరిగిన ‘ మ హిళా సంక్షేమ సంబరాలు ‘ కార్యక్రమంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు సిఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఒంటరి మహిళ పేరిట పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేన ని వినోద్ కుమార్ పేర్కొన్నారు. భర్త విడిచిపెట్టినా.. వివిధ కారణాల వల్ల పెళ్లి జరగకపోయినా.. అలాంటి మహిళలకు గతంలో వి డో పేరిట పెన్షన్ ఇచ్చేవారని, ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ చాలా బాధపడ్డారని, అలాంటి మహిళలకు ఒంటరి మహిళ పేరిట పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారని, సీఎం కేసిఆర్ గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి అని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమంలో భాగంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారని, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఆరోగ్య మహిళ, వి హబ్, షీ టీమ్స్, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, అంగన్వాడి, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు, ప్రతి జిల్లాకు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అ మలు చేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, తద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కార్యక్రమాలు, పథకాల గురించి మహిళకు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News