Wednesday, January 22, 2025

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని శి ల్పారామంలో నిర్మించిన మహబూబ్‌నగర్ నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబరాలలో మంత్రి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మం త్రి 540 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ల బ్ధిదారులకు రూ.5 కోట్ల 40 లక్షల 62వేల 640ల చెక్కులను పంపిణీ చేశారు. బ్యాంకుల అనుసంధానంతో 21 మహిళా స్వయం సహాయక సంఘాల కు కోటి 14 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు.

ఒక్కొక్కటీ లక్ష డ్బ్బై ఐదు వేల రూపాయల విలువ చేసే 18 గొర్రెల యూనిట్లను రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులపై ఆధార పడే బీసీ కులాలకు ఆర్థ్ధిక అభివృద్ధ్ది చేకూర్చే పథకాన్ని ఈ రోజు నుండి ప్రారంభించగా, ఆ పథ కం కింద 5 మంది లబ్ధిరులకు లక్ష రూపాయలను 100శాతం సబ్సిడీ చెక్కులను అందజేశారు. మైనా ర్టీ సంక్షేమ శాఖ ద్వారా 52 మంది లబ్ధ్దిదారులకు చెక్కులను అందించగా , అందులో 38 మందికి ల క్ష రూపాయలు చొప్పున 14 మందికి రెండు లక్షల రూపాయల ఆర్థ్ధిక సహాయం చెక్కులను అందజేశారు.

144 మంది లబ్ధ్దిదారులకు సాంఘిక సంక్షేమ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 70 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు 200 రూపాయల పెన్షన్లు సైతం సక్రమంగా ఇవ్వలేదని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన త ర్వాత ప్రతి నెల రూ. 2వేల పెన్షన్ ఇచ్చి పేదలలో భరోసా కల్పించామని అన్నారు. అతి పేద కు లాలు, వృత్తులు చేసుకునే వారికి, కులవృత్తుల పై ఆధారపడి జీవించే బిసిలకు లక్ష రూపాయల చొ ప్పున తిరిగి రూపాయి కూడా చెల్లించకుండా 100 శాతం సబ్సిడీతో ఏర్పాటు చేసిన బిసి కులాల సం క్షేమ పథకం కింద ఈ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తం గా పంపిణీ చేస్తున్నామని, మహబూబ్‌నగర్‌లో 5 మందికి ఈ పథకం కింద చెక్కులు అందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులా లు, మతాలు వర్గాల సంక్షేమంలో భాగంగా మని షి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒకరకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు.

కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు , కేసీఆర్ కిట్ , రైతుబంధు, రైతు భీమా, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నామని, గ్రామాలలో స్మశా న వాటికలు, హరితహారం కింద మొక్కలు పెంప కం, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రీగేషన్ షెడ్లు ప్రతి ఊరికి ట్రాక్టర్ వంటివి ఏర్పాటు చేశామని, అలాగే ఆయా కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చే వి ధంగా చేతివృత్తులు, కులవృత్తులకు చేయూతనిచ్చామని, మత్స కార్మికులకు వలలు ఇతర సబ్సి డీ పథకాల అందించామని, చెరువులలో ఉచిత ంగా చేప పిల్లలను పంపిణీ చేశామని, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, దళితులకు దళిత బంద్ కి ంద పది లక్షల రూపాయల ఆర్ధిక సహయం అందజేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చే స్తున్నట్లు వెల్లడించారు.

మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లి ఐటి కారిడార్‌లో రానున్న కాలంలో అనేక పెద్ద కంపెనీలు వచ్చి ఎంతో మ ందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, మహబూబ్‌నగర్‌ను ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ ఒక బృ ందంగా ఏర్పడి లబ్ధ్దిదారులకు ప్రభుత్వం తరపున వచ్చే అన్ని రకాల లబ్ధ్దిని సకాలంలో అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అనేక సంక్షేమ ఫలాలు పొందిన వారు ఎంతో మంది ఉ న్నారని అన్నారు.

సంక్షేమ సంబరాల్లో 54 మం దికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 52 మందికి ఆర్థిక సహాయం , గొర్రెల పంపిణీ కింద 18 మందికి గొర్రెల పంపిణీ, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఇంటి పట్టాల పంపిణీ వంటివి అందజేయడం జరిగిందని , ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ , బీసీలకు ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మేలు చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఎంపీపీ సుధాశ్రీ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మధుసూదన్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమ అధికారి టైటస్ పాల్ , ఎస్సీ కార్పోరేషన్ ఈడి యాదయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News