Monday, December 23, 2024

బఖ్‌ముత్ నగరం మొత్తం నాశనమైంది : జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతమైన బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని స్వయంగా అభినందించినట్టు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ పేర్కొంది. అయితే రష్యా వాదనను ఉక్రెయిన్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. రష్యా సేనల మద్దతుతో వాగ్నర్ ప్రైవేట్ సైన్యం దాడులు సాగించి నగరం మొత్తం శిధిలం చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది.

తమ సైన్యం వీరోచితంగా పోరాడిందని, రష్యన్లు చెబుతున్నట్టుగా అక్కడేమీ మిగల లేదని, శిధిల భవనాలే మిగిలాయని ఉక్రెయిన్ వెల్లడించింది. జపాన్ పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రస్తుతానికి బఖ్‌ముత్ తమ మనసుల్లో మాత్రమే ఉందని ఆవేదన వెలిబుచ్చారు.

ఇదిలా ఉండగా, అత్యంత సుదీర్ఘకాలం పోరు సాగిన తరువాత బఖ్‌ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని, శనివారం మధ్యాహ్నానికి నగరం మొత్తం రష్యా అధీనం లోకి వచ్చిందని వాగ్నర్ గ్రూప్ తెలియజేసింది. వాగ్నర్ ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది. గత 224 రోజులుగా ఉక్రెయిన్ సైన్యం వీరోచితంగా పోరాడుతోందని, ఈ దాడుల్లో దాదాపు 30 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని అంచనాగా చెప్పింది. ఉక్రెయిన్ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టాన్ని పొందిందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News