Sunday, December 22, 2024

మోడీ మూడోసారి ప్రధాని కావాలని దేశమంతా కోరుతోంది

- Advertisement -
- Advertisement -

పదేళ్లు పరిపాలించింనా అవినీతి మరక లేదు
కాంగ్రెస్ ఫ్రంట్‌ల పేరుతో రాజకీయ డ్రామాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వేలన్ని కూడా మోడీకి అనుకూలంగా ఉన్నాయని, ఇతరులెవరూ ఆయన దరిదాపుల్లో లేరని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. దేశమంతటా మరోసారి మోడీ ప్రధాని కావాలని ఎక్కడ చూసినా చర్చ జరుగుతోందన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

ఈసందర్బంగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతీ ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్ర మోడీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి అధికారం కోసమే పగటి కలలు కంటున్నాయన్నారు. దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోడీ అరికట్టారని పేర్కొన్నారు. దేశాన్ని అనేక మంది పరిపాలించారని, ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక్క అవినీతి మరక ఉందన్నారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. కాంగ్రెస్ ఫ్రంట్ ల పేరుతో మోడీని దించాలని కుట్ర చేస్తున్నారన్నారని, దీనిని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News