- Advertisement -
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా కార్చిచ్చు పెద్ద సమస్యగా మారి లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి బూడిదవుతున్నాయి. వేలాది వన్యప్రాణులు అంతరించి పోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును ముందుగానే అంచనా వేయొచ్చునంటూ బాలిక రేష్మొ కొసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్ క్లైమేట్ ప్రైజ్‌ను దక్కించుకుంది. రేష్మొ కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడింది.
- Advertisement -