సిఈవో వికాస్‌రాజ్ ను కోరిన కాంగ్రెస్ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపు ధృవ పత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని, వెంటనే ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరినట్లు ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. శనివారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొంగులేటి, మధుయాష్కీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు సిఈవోను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ‘రైతుబంధు’ నిధులను ఇతర వాటికి చెల్లించకుండా చూడాలని సిఈవో వికాస్‌రాజ్‌ను కోరినట్లు చెప్పారు. గ్రేటర్ చుట్టు పక్కల భూముల విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు తమకు అనుమానం ఉందని వాటిపై నిఘా పెట్టాలని కోరామన్నారు. ఫలితాల సమయంలో ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసికి సూచించినట్లు పేర్కొన్నారు.