Monday, December 23, 2024

ఫోన్ కొట్టేసిన దొంగను వెంటాడిన వనిత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన మొబైల్ ఫోన్ కొట్టేసిన దొంగలను వెంటాడి పట్టుకుంది ఒక 31 ఏళ్ల మహిళ. ఒక దొంగ పారిపోగా మరో మైనర్ దొంగ ఆమె చేతికి చిక్కాడు. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని రోరీ గార్డెన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మోతీ నగర్ నివాసి అయిన రుచి గుల్యాని రాజోరీ గార్డెన్‌లోని తన ఆఫీసుకునడుచుకుంటూ వెళుతుండగా స్కూటర్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆమె చేతిలోని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకున్నప్పటికీ వారు బలవంతంగా ఆమె చేతిలోనుంచి లాక్కుని ఉడాయించారు. వెంటనే ఆమె అటుగా వెళుతున్న ఒక స్కూటరిస్టును దొంగలను పట్టుకోవడానికి సాయం చేయాలని ఆమె కోరింది.

అతని సాయంతో ఆమె ఆ ఇద్దరు దొంగలను వెంటాడింది. ఆ ఇద్దరు దొంగలు టాగోర్ గార్డెన్ ఎక్స్‌టెన్షన్ వద్ద మరో వ్యక్తి సెల్‌ఫోన్‌ను కూడా చోరీ చేశారు. ఇంతలో పోలీసులకు కూడా ఈ విషయం తెలిసి ఆ ఇద్దరు సెల్‌ఫోన్ దొంగల కోసం వారు కూడా గాలింపు ప్రారంభించారు. ఆ మహిళ మాత్రం వేటను ఆపకుండా కొనసాగించిచింది. ఆ మహిళతోపాటు పోలీసులు కూడా ఎట్టకేలకు ఇద్దరిలో ఒక దొంగను పట్టుకోగలిగారు. మరో దొంగ పరారయ్యాడు. 17 ఏళ్ల మైనర్ దొంగపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దొంగల పాలైన తన సెల్‌ఫోన్‌ను తిరిగి చేజిక్కించుకోవడానికి ఆ మహిళ చేసిన సాహసాన్ని పోలీసులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News