Monday, December 23, 2024

దత్తత గ్రామాలలోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: దత్తత గ్రామాల విద్యుత్ పనులపై, పారామీటర్లతో పాటు అన్ని పనులను పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు అన్నా రు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌లో డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, వి.తిరుపతి రెడ్డి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఎస్.ఈలతో, డి ఈలతో, ఎస్‌ఏఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సియండి అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ, దత్తత గ్రామాలలో కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలని సూచించారు. నియంత్రికల వైఫల్యాలను తగ్గించాలని, రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలని, సంవత్సరం పైబడిన డిస్కనెక్షన్ ల సర్వీసుల తనిఖీ చేపట్టాలని అన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ ఎప్పటికప్పుడు ఇబ్బందులు కలుగకుండా లైన్ల పాట్రోలింగ్ నిర్వహించాలన్నారు. విధిగా హెడ్ క్వార్టర్స్లో విద్యుత్ అధికారులు,సిబ్బంది అందుబాటులో ఉండి ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పెంచాలని, రోలింగ్ స్టాక్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. వ్యవసాయ సర్వీసులకు మంజూరులో జాప్యం లేకుండా చూడాలని, టిఎస్‌ఐపాస్, నాయిబ్రాహ్మణ, దోభీఘాట్, లాండ్రీల సర్వీసులను కూడా మంజూరు ఆలస్యం జరగకుండా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్(హెచ్గార్డి, పి ఎంఎం) బి.వెంకటేశ్వర రావు, డైరెక్టర్(ఐపిసి ఆర్‌ఎసి) పి.గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) పి.సంధ్యారాణి, డైరెక్టర్(ప్రాజెక్ట్స్, ఆపరేషన్ )పి.మోహన్ రెడ్డి, ఇంచార్జ్ డైరెక్టర్ (ఫైనాన్స్)వి.తిరుపతి రెడ్డి, సి.జి.యంలు కిషన్, అశోక్ కుమార్, సదర్ లాల్, బీకంసింగ్, జియంలు, ఎస్‌ఈ వరంగల్ మధుసూదన్, ఎస్‌ఈ మహబూబాబాద్ నరేష్, డీఈలు, ఎస్‌ఏఓలు, డిఈ(ఐటి) అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News