Thursday, January 23, 2025

వర్షాల నాటికి నాలాల అభివృద్ధ్ది పనులు పూర్తి కావాలి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: వర్షాకాలంలోకి ప్రవేశిస్తుండడంతో జిహెచ్‌ఎంసి ముంపు సమస్యలపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. నగరం వరద ముంపునకు గురికావడానికి ప్రధాన కారణమైన నాలాలే కావడంతో వాటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఇందులో భా గంగా ఎస్‌ఎన్‌డిపి ద్వారా నగరంలో జిహెచ్‌ఎం సి ప్రధాన కాల్వల అభివృద్ధిని చేపట్టింది. ఇందు లో భాగంగా ఎల్‌బినగర్ పరిసర ప్రాంతాలతో పా టు పికెట్ నాలా పనులు ఇప్పటికే పూర్తి కావడమే కాకుండా వాటిని ప్రారంభించుకోవడం జరిగింది. మిగిలిన నాలాల పనులు సైతం తుది దశకు చేరుకోవడంతో వాటిని వర్షాలు కురిసే నాటికి పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి కసరత్తును చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి బేగంపేట్ బ్రహ్మణ వాడి ప్రాం తంలో నాలా అభివృద్ధ్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడు తూ వర్షాలు కురిసే నాటికి నాలాల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎస్‌ఎన్‌డిపి అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి నాలా బేగంపేట్ డివిజన్‌లోని బ్రాహ్మణ వాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, అల్లంతోటబావి, వడ్డెర బస్తీలను అనుకుని ప్రవహిస్తు ఉంటుంది. దీంతో ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, వీ టి నివారణకు రూ. 45 కోట్లతోఎస్.ఎన్.డి.పి కింద పనులను చేపట్టామని తెలిపారు. ఇందులోభాగం గా నాలాల రిటైనింగ్ వాల్స్ మరమ్మతులతో పాటు కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సీవరేజ్ పైప్‌లైన్, స్ట్రామ్ వాటర్ డ్రె యిన్స్ వేర్వేరుగా నిర్మించాలని అధికారులను అదేశించారు.

భారీ వర్షాలకు నాలాల నీరు పొంగిపొర్లకుండా రిటైనింగ్ వాల్ ఎత్తును పెంచడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు ప్రవహించకుండా సంపులను నిర్మించి పంపింగ్ ద్వారా నీటిని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పానరు. అదేవిధంగా బ్రాహ్మణవాడి నుండి గీతాంజలి స్కూ ల్ వరకు రూ. 39 కోట్లతోనిర్మించనున్న వి.డి.సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. బ్రాహ్మణ వాడిలో నాలా పక్కన ఉన్న స్వామి రామనందతీర్థ ట్రస్ట్ ను సందర్శించిన మేయర్ వర్షపు నీరు నిలువకుండా గేట్ల ద్వారా నీటిని నాలాలోకిమళ్లించాలన్నారు. ఈ ట్రస్టులో ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ట్రస్టులో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను, విద్యార్థులకు అందిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ వివరాలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. ట్రస్టులోని మాజీ ప్రధాని పి.వి.నర్సింహా రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జోనల్‌కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.డి.పి ఎస్.ఇ భాస్కర్ రెడ్డి, ఇ.ఇ సుదర్శన్, వాటర్ వరక్స్ అధికారి ప్ర వీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News