Wednesday, December 25, 2024

ప్రారంభం కానున్న శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు 4వ యూనిట్ పనులు

- Advertisement -
- Advertisement -
అధికారులను అభినందించిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు

హైదరాబాద్ : రెండు సంవత్సరాల క్రితం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్యూట్ 4వ యూనిట్ పూర్తిగా కాలిపోవడంతో ఇందుకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి పనులు కూడా ఆగిపోయాయి.అయితే అధికారుల నిరంతర కృషి ఫలితంగా  ఎట్టికేలకు నేడు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో 145 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తకి అవకాశం ఏర్పడుతుంది. రిజర్వాయర్‌లో నీటి మట్టం అనుకూలించి హెడ్ ప్రజర్ పెరగ్గానే ఈ 4 యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరగా 4వ యూనిట్‌ను పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయడంతో ట్రాన్స్, జెన్‌కో ఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు సిబ్బందిని అభినందించారు. ఇందుకు సంబంధించిన పనులను మొదట నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించిన హైడల్ డైరక్టర్ సిహెచ్. వెంకట రాజాం, ఇతర ఉన్నతాధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News