Monday, December 23, 2024

గ్రామీణ ఉపాధిహామీ కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-/24 సంవత్సరానికి జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి 1410 ఎకరాలలో ప్రభుత్వ ప్రోత్సాహకం అందించనుందని, 5 ఎకరాల లోపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, చిన్న, సన్నకారు రైతులు అర్హులని, తోట నాటిన మొదటి సంవత్సరం నుండి 4 సంవత్సరాల వరకు రాయితీ లు, ప్రోత్సాహకాలు ఇవ్వబడుతాయని, లబ్దిదారులను వీలైనంత త్వరగా ఎంపిక చేసుకొని జాబ్ కార్డులు మంజూరు చేయాలని, ఎస్టిమేట్ జనరేట్ చేసి ఫిట్టింగ్, ఇన్స్టాలేషన్ వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ఉన్న ఐదు ఎకరాల లోపు అనువైన భూమి కలిగి, ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న ఎస్.సి., ఎస్.టి., చి న్న, సన్నకారు రైతులు అర్హులని, ఈ నెల 31 లోగా అర్హులైన వారిని గు ర్తించి, ఆగస్టు 15 లోగా ఎస్టిమేషన్ తయారు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సాగు చేయబడిన పంటల వివరాలను వచ్చే ఆగస్టు 15 లో గా పక్కాగా నమోదు చేయాలని, పట్టాదారు పుస్తకం పొందని రైతులను గుర్తించి సర్వే నెంబరు, రైతు వారిగా, ఆధార్ వారిగా ఆన్ లైన్ నమోదు చేయాలని ఆదేశించారు.

వచ్చే ఆగష్టు 5లోగా అర్పులైన ప్రతి రైతును రై తు బీమా పథకంలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, రైతుబీమా వర్తించేలా వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రతి రైతును నమోదు చేయాలని, రైతు వేదికలలో రైతు బీమా చేయించుకోని రైతుల వివరాలను ప్రదర్శించాలని, వ్యవసాయ విస్తరణాధికారులు రోజువారి టార్గెట్ నిర్ణయించుకొని పనిచేయాలని, సన్న చిన్న కారు రైతులు, ఎస్సి, ఎస్టి, మహిళా రైతులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.

పీఎం కిసాన్ సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ శాఖకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హరితహారం, స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా వ్యవసాయ అధికా రి అనూర, పంచాయతీ రాజ్ ఇఇ వెంకటేశ్వర్లు, అధికారులు,మండల అ భివృద్ధి అధికారులు,మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News