Sunday, December 22, 2024

శతాబ్ది కాలంలో కాని పనులు దశాబ్ది కాలంలో పూర్తి

- Advertisement -
- Advertisement -

గాందారి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గాందారి మండల కేంద్రంలో శనివారం గిరిజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ పాల్గొని గిరిజనులతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా బయలుదేరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 500 గిరిజనుల తాండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి అభివృద్ధ్ది చేసిందన్నారు. శతాబ్ది కాలంగా నెరవేరని గిరిజనుల కలలను సిఎం కెసిఆర్ దశాబ్ది కాలంలో నెరవేర్చారని తెలిపారు. గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దేనని కొనియాడారు.

గిరిజన జాతికి ఆయన ఎప్పటికీ ఆరాద్యుడిగా ఉంటారని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను గుర్తుంచుకోవాలని అన్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవండం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ శంకర్ నాయక్, ఎంపిపి రాధా బలరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు, గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజావులు, తహశీల్దార్ గోవర్దన్, ఎంపిడివో సతీష్, మండలంలోని తాండాల సర్పంచ్లు, ఎంపిటిసీలు, ఉప సర్పంచ్లు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News