Monday, December 23, 2024

ఊబికాయంలోకి ప్రపంచం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో 2022లో 5, 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న, దాదాపు 125 లక్షల మంది పిల్లలు పరిమితికి మించిన బరువుతో ఉన్నారని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ప్రపంచ విశ్లేషణ నివేదిక వెల్లడించింది. వారిలో 73 లక్షల మంది బాలురు కాగా 52 లక్షల మంది బాలికలు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో జీవిస్తున్న పిల్లలు, వయోజనులు, పెద్దల మొత్తం సంఖ్య నూరు కోట్లు దాటింది. 1990 నుంచి తక్కువ బరువు ఉన్నవారి సంఖ్య క్షీణతతో పాటు ఈ సరళులు చాలా వరకు దేశాలలో ఊబకాయాన్ని సాధారణ పౌష్టికాహార లోపాన్ని సూచిస్తోంది. ఊబకాయం, తక్కువ బరువు పౌష్టికాహార లోపం వల్ల ఎదురయ్యేవే.

అవి చాలా విధాలుగా ప్రజల ఆరోగ్యానికి హానికరమే. గడచిన 33 ఏళ్లలో పౌష్టికాహార లోపంతో ప్రపంచ సరళులకు తాజా అధ్యయనం సూచికగా ఉంటోంది. ప్రపంచ శాస్త్రవేత్తల నెట్‌వర్క్ ఎన్‌సిడి రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (ఎన్‌సిడి= రిస్క్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ& హు) చేసిన విశ్లేషణ ప్రపంచంలోని పిల్లలు, వయోజనులలో 2022లో ఊబకాయం రేటు 1990లోని రేటుకు నాలుగింతలుగా ఉందని అంచనా. ‘1990లో ప్రపంచంలో అధిక భాగంలో పెద్దలలో కానవచ్చిన ఊబకాయం రుగ్మత ఇప్పుడు బడి వయస్కులైన పిల్లలు, వయోజనులలో కానవస్తుండడం ఎంతగానో కలవరపరుస్తోంది’ అని యుకెలో లండన్ ఇంపీరియల్ కళాశాల ప్రొఫెసర్, సీనియర్ రచయిత మజీద్ ఎజ్జతి తెలిపారు. ‘అదే సమయంలో లక్షలాది మంది, ముఖ్యంగా ప్రపంచంలోని నిరుపేద ప్రాంతాలు కొన్నిటిలో పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహార పదార్ధాల లభ్యతను గణనీయంగా మెరుగుపరచడం. వాటిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం కీలకం’ అని ఎజ్జతి అన్నారు. పెద్దలలో ప్రపంచ ఊబకాయుల రేటు మహిళల్లో రెండింతలకు పైగా, పురుషులలో సుమారు మూడింతలు పెరిగింది. ఆ అధ్యయనం ప్రకారం, మొత్తంగా 15.9 కోట్ల మంది పిల్లలు, వయోజనులు, 87.9 కోట్ల మంది పెద్దలు 2022లో ఊబకాయులుగా ఉన్నారు. భారత్‌లో పెద్దల్లో ఊబకాయం రేటు మహిళల్లో 1990లోని 1.2 శాతం నుంచి 2022లో 9.8 శాతానికి, పురుషుల్లో 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. 2022లో సుమారు 4.4 కోట్ల మంది మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాఢ పడుతున్నారు.1990, 2022 మధ్య ప్రపంచంలో తక్కువ బరువు సమస్యతో ఉన్న పిల్లలు, వయోజనుల దామాషా బాలికల్లో ఐదింట ఒక వంతు, బాలురలో మూడింట ఒక వంతు పైగా పడిపోయింది. ప్రపంచంలో తక్కువ బరువు సమస్యతో ఉన్న పెద్దల దామాషా అదే కాలంలో సగంపైగా తగ్గింది.

ఊబకాయం రేటు బాలికలకు 1990లోని 0.1 శాతం నుంచి 2022లో 3.1 శాతానికి, బాలురలో 0.1 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. 190 పైగా దేశాలకు చెందిన ఐదు సంవత్సరాలు లేదా ఎక్కువ వయస్సు గల 22 కోట్ల మందికి పైగా ప్రజల బరువు, ఎత్తు కొలతలను పరిశోధకులు విశ్లేషించారు. (5, 19ఏళ్ల మధ్య వయస్కులు 6.3 కోట్ల మంది, 20, ఆపైన వయస్కులు 15.8 కోట్ల మందిపై విశ్లేషణ జరిపారు.) 1990, 2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, తక్కువ బరువు మధ్య ఏవిధమైన మార్పు చోటు చేసుకుందో అవగాహన చేసుకోవడానికి 1500 మందికి పైగా పరిశోధకలు అధ్యయనం జరిపారు. వారు బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ)ను పరిశీలించారు. 1990, 2022 మధ్య ప్రపంచంలో ఊబకాయం రేట్లు బాలికలు, బాలురలో నాలుగింతలకు పైగా నమోదయ్యాయని, దాదాపు అన్ని దేశాలలో పెరుగుదల కానవచ్చిందని అధ్యయనం తెలిపింది. 2022లో ఊబకాయం సమస్య బాధ పడుతున్న పిల్లలు, వయోజనుల మొత్తం సంఖ్య సుమారు 16 కోట్లు (వారిలో 6.5 కోట్ల మంది బాలికలు, 9.4 కోట్ల మంది బాలురు). 1990లో ఆ సంఖ్య 3.1 కోట్లుగా ఉన్నది. 2022లో తక్కువ బరువుల గల బాలికల సంఖ్య 7.7 కోట్లు కాగా, బాలుర సంఖ్య 10.8 కోట్లు. 1990తో పోలిస్తే వారి సంఖ్య తగ్గింది. 1990లో తక్కువ బరువు గల బాలికల సంఖ్య 8.1 కోట్లు, బాలుర సంఖ్య 13.8 కోట్లు. ఇక 1990, 2022 మధ్య పెద్దలలో ఊబకాయం రేట్లు మహిళల్లో రెండింతలు దాటగా, పురుషులలో సుమారు మూడింతలు అయ్యాయి. 1990, 2022 మధ్య తక్కువ బరువు గల పెద్దల దామాషా సగం తగ్గింది. అన్ని వయో వర్గాలలో పౌష్టికాహార లోపం 1990, 2022 మధ్యచాలా దేశాలలో పెరిగింది. ఊబకాయుల రేట్లు పెరుగుదల ఇందుకు దోహదం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News