Monday, January 20, 2025

ప్రపంచం భారత్ వైపు చూస్తుంది

- Advertisement -
- Advertisement -

బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది
జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్ మండలానికి చెందిన 10 మంది మాజీ బిఆర్‌ఎస్ సర్పంచులు, ప్రస్తుత సొసైటీ చైర్మన్లు , మాజీ సొసైటీ చైర్మన్లు, ఎంపిటిసిలు,జెడ్పిటిసిలు, ఆపార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాషాయం జెండా కప్పుకున్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి ఎన్ వి. సుభాష్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ తాను బిజెపిలో చేరడం సంతోషంగా ఉందని, యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని పేర్కొన్నారు. నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో,ఎస్సీ వర్గీకరణ కోసం,దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందని ఈపార్టీలో చేరానని వెల్లడించారు.ఏ పార్టీలో ఉన్నా ప్రజా సేవ,అభివృద్ధి నాకు ముఖ్యమని,మోడీ నాయకత్వంలో పనిచేయాలని తాను పార్టీ మారినట్లు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వ పాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో మీడియా కమిటీ మెంబర్ రాణా, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్, బిసి మోర్చా అధికార ప్రతినిధి హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News