Monday, November 18, 2024

మల్లయుద్ధ టోర్నీ అభినందనీయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మల్లయుద్ధ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ నిర్వాహకులను కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యేలా ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని వీడియో సందేశంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ స్మారకార్థం రూ.30లక్షల నగదు బహుమతి, రూ.5లక్షల ఉపకార వేతనంతో అందించే దిశగా టోర్నీని ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ నిర్వహిస్తున్నారు. రెండోరోజు పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. టోర్నీలో తొలిరోజు అండర్ 15, అండర్ 17 విభాగాల్లో టోర్నీ నిర్వహించగా రెండోరోజు పురుషుల సీనియర్ విభాగంలో 55కేజీలు, 60కేజీలు, 66కేజీల కేటగిరిల్లో పోటీలు జరిగాయి. 700 మంది రెజ్లర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News