Monday, December 23, 2024

పాత పగ.. దుకాణానికి నిప్పు పెట్టిన యువకుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఎర్రుపాలెం: మండల పరిదిలోని రామన్నపాలెం గ్రామంలో పాత పగలతో కొత్తపల్లి ప్రకాశరావు అను యువకుడు నడుపుతున్న దుకాణాన్ని గత నెల 28 వ తేది అర్దరాత్రి పెట్రోల్ పోసి దగ్దం చేసిన సంఘటన చోటు చేసుకొంది. బాధితుని ఫిర్యాదుకు విచారణ చేసిన ఎస్సై సురేష్ అదే గ్రామానికి చెందిన బొబ్బిళ్ళపాటి పుష్పరాజ్ పాత గొడవల కారణంగా పగ పెంచుకొని దుకాణం దగ్దం చేసినట్లు ఒప్పుకొన్నాడన్నారు.

ప్రకాశరావు నడుపుతున్న షాపులో జిరాక్స్‌మిషన్ రెండు కూలర్లతో పాటు కిరాణా పచారీ సామాగ్రి పూర్తిగా దగ్దమయ్యి రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మంగళవారం నిందితుడుని మధిర జెఎఫ్‌సియం న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి సదరు నిందితునికి 14రోజులు రిమాండు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News