మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డిఐజిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి. శ్రీనువాస్‌ను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం శాంతియుతంగా ముందుకు వెళ్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తానని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజి శ్రీనువాస్ అన్నారు.
యూత్ పర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న మా సంస్థకు ఎంతో మంది అధికారులు సలహలు, సూచనలతో ముందుకు వెళతామన్నారు. డిఐజి శ్రీనివాస్ సర్ తమ సంస్థకు సలహలతో పాటు సహకారం అందిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ రేంజ్ జైళ్లశాఖ డిఐజిగా రావడం అభినందించదగ్గ విషయమని, మా సంస్థకు అందుబాటులో ఉంటూ సలహలు, సూచనలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు కొమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, బత్తిని రాజేశ్, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.