Monday, December 23, 2024

విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలి

- Advertisement -
- Advertisement -
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్ : వివేకానంద స్పూర్తితో- భగత్ సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) జాతీయ వర్క్ షాప్ చివరి రోజు సెషన్ హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరిగింది. ఈ సెషన్‌కు ముఖ్య అతిధిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నేటి యువత హేతుబద్ధమైన ఆలోచనలు చేయాలని, నిరంతరం అధ్యయనం చేయాలని దేశ సమసమాజ స్థాపనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు. సమాజ మార్పులో యువత పాత్ర కీలకమన్నారు. బలహీనమైన యువత దేశానికి భారమని, బలమైన ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో కూడిన యువత సమాజ మార్పుకు కీలకమని ఉద్ఘాటించారు. మనిషి సర్వ మానవులు, కొన్ని శతాబ్దాల క్రితం మనిషి అవతరణ ఆఫ్రికాలో జరిగిందని. అక్కడి నుండి వలసల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడ్డారన్నారు. ఆఫ్రికాలో ఉన్న, ఆసియాలో ఉన్న, యూరప్ లో ఉన్న విశ్వ మానవులంతా వసుధైక కుటుంబ సభ్యులేనన్నారు.

మనిషి పుట్టి లక్ష సంవత్సరాలు అయితే, మతాలు పుట్టి నాలుగు వేల సంవత్సరాలు అయ్యిందన్నారు. ఏ మతమైనా మనిషి పరి పూర్ణ సమాజ శ్రేయస్సుకే తప్ప విద్వేషాలను రెచ్చకొట్టడానికి కాదన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో బిజెపి మత రాజకీయాలను అనుసరిస్తున్నదని,దీనిని యువత ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఎన్నికలు చివరివని, దేశ ప్రజలు బిజెపిని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. దేశ యువత ప్రస్తుత రాజకీయాలను నిశితంగా అర్ధం చేసుకోవాలని, విచ్చిన్నకర విధానాలను వ్యతిరేకంగా ఎఐవైఎఫ్ సమాజంలో ఐక్యతను చాటేలా వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ వర్క్ షాప్ రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా నూతన రాజకీయ నాందికి దోహదపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ టిటి. జిస్మాన్, లెనిన్ బాబు, అరుణ్, విక్కీ, హరీష్ బాల, భారతి, కరంవీర్ కౌర్, ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సల్మాన్ బైగ్, టి. సత్య ప్రసాద్‌లతో పాటు 23 రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News