- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రెండు వారాల పటు సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని యాజమాన్యాలు తెలిపాయి. ఆక్కుపెన్సీ తక్కువగా ఉండటం వల్ల సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రదర్శనల వల్ల నష్టం ఎక్కువ వస్తుందన్న యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని యాజమాన్యాలు పేర్కొన్నాయి.
- Advertisement -