- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.లక్షన్నర నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నాల ఇంట్లో ఉన్న సిసి కెమెరాలతో పాటు పని మనుషులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -