Friday, December 20, 2024

చోరీ కేసులో కేంద్ర మంత్రి సరెండర్..

- Advertisement -
- Advertisement -

జామ్‌నగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ నగల దుకాణంలో దొంగతనం కేసులో పశ్చిమ బెంగాల్‌లని ఓ కోర్టులో లొంగిపోయి తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. 2009లో అలిపూర్‌దువార్‌లోని రెండు నగల దుకాణాలలో జరిగిన చోరీ కేసులో ఆయన నిందితుడు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉందని అభియోగాలు వెలువడ్డాయి. గత ఏడాది నవంబర్‌లో ఆయనకు అలీపూర్‌దువార్ జిల్లా కోర్టు అరెస్టు వారంట్ వెలువరించింది.

కూచ్ బెహర్ నుంచి బిజెపి ఎంపిగా ఆయన ఆ తరువాత బెయిల్ కోసం కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి, ఆయన వ్యక్తిగతంగా 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు సరెండర్ అయ్యారు. కోర్టులో ముప్పావుగంట ఉన్నారు. తరువాత వెళ్లారు. ఇకపై బెయిల్ విచారణకు తాను కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని, తన తరఫున లాయర్లు రావచ్చునని సహాయ మంత్రి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News