- Advertisement -
బాసర: బాసర మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నాలుగు ఇండ్లలో చోరీ జరిగింది. దుండగులు తాళం వేసి టార్గెట్‌గా చేసుకొని దోపిడికి పాల్పడ్డారు. స్థానిక ఉప్పుకుంట గల్లిలో రెండు, అనుబంధ గ్రామమైన మైలాపూర్‌లో మరో రెండు ఇండ్లలో చోరి జరిగింది.
ఇక ఇంట్లో వృద్దురాలు ఉంటే చేతిలో ఉన్న గడ్డపారతో భయపెట్టించి ఇంట్లో ఉన్న సొమ్మంతా దోచుకెళ్లారు. గ్రామంలో ఉన్న సిసి కెమెరాల ద్వారా ముగ్గురు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత బాసరలో ఇలా దొంగతనానికి పాల్పడడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మొదలు సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్‌ఐ మహేష్, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగలను అతి త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
- Advertisement -