Tuesday, April 1, 2025

రామంతపూర్ లో ఐదు ఇళ్లలో చోరీ…

- Advertisement -
- Advertisement -

 

మెదక్: మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఐదు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు.  గన్నేరుల యాదగిరి ఇంట్లో లక్షన్నర నగదు, 150 కిలోల బియ్యం, ముక్క శ్రీకర్ ఇంట్లో నాలుగు సెల్ ఫోన్లు, 50 వేల నగదు, కర్రోల శివ గౌడ్ ఇంట్లో టివిని చోరీ చేశారు. మిగిలిన రెండు ఇండ్లలో నగదు లభించకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. బాధితులు, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News