- Advertisement -
హైదరాబాద్: రామంతపూర్ బాలజీనాగర్ కు చెందిన లీలావతి పెళ్లి ఉందని బంధువుల ఇంటికి వెళ్లడంతో అర్ధ రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగల గొట్టి చోరీ చేశారు. బుధవారం ఉదయం పనిమనిషి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో కుటుంబసబ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో వెండి చోరీ జరిగినట్టు ఇంటి యజమానురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -