Sunday, December 22, 2024

అన్న కూతురి వివాహం..ఇంట్లో భారీ చోరి

- Advertisement -
- Advertisement -

తాండూరు : ఓ ఇంట్లో భారీ చోరి జరిగిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి పక్కన అస్గారి మసీద్ వద్ద ఆర్టీఓ ఏజెంట్ మహ్మద్ వాజీద్ నివాసం ఉంటాడు. శుక్రవారం రాత్రి అన్న కూతురు వివాహనికి వాజీద్ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి అలమార చూడగా తెరిచి ఉంది.

అలమారాలో దాచిపెట్టిన రూ.28లక్షలు నగదు దొంగతనం జరిగినట్లు తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుపై కందనెల్లి వద్ద ఉన్న ప్లాటు విక్రయించగా వచ్చిన డబ్బులను ఇంట్లోనే దాచి పెట్టినట్లు బాధితుడు వాజీద్ తెలిపారు. ఇంటి వెనకాల నుంచి రైల్వే పట్టాలు ఉన్నందున గోడదూకి వచ్చి ఇంటికి వేసిన తాళం విరగొట్టి తలుపులు తెరిచి దొంగతనం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న తాండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంతో ధర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News