Wednesday, January 22, 2025

నల్లజానమ్మ ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ పూజారి నాగేందర్ ఎప్పటిలాగే మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆలయాన్ని శుభ్రపరిచి నిత్యపూజలను నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయం వద్దకు వచ్చి పూజారి దృష్టి మరల్చి అమ్మవారి బంగారు హారాన్ని తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పూజారి భక్తులకు సమాచారం తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన బంగారు హారం 2తులాలు ఉంటుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News