Saturday, November 16, 2024

రవాశాఖ కార్యాలయాల పార్కింగ్ ప్రాంతాల్లో చిల్లర దొంగల చేతివాటం

- Advertisement -
- Advertisement -

రద్దీ ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయని అధికారులు

మన తెలంగాణ సిటీబ్యూరో: రవాశాఖకు గ్రేటర్ హైదరాబాద్‌లో 5 రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పార్కింగ్ కేంద్రాల్లో చిల్లర దొంగల చేతివాటంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా రవాణాశాఖకు పెద్ద ఎత్తున ఆదాయం తీసుకు వచ్చేది, విఐపి, వివిఐపిలు తరచు వచ్చి తమ రవాణా సంబంధిత కార్యక్రమాలను స్వయంగా చేసుకునే కార్యాలయం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం. ఈ కార్యాలయానికి నగరంలో ముఖ్యమైన హోదా కలిగిన వారే కాకుండా సాధారణ ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి తమ పనులు చక్కపెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడ అధికారులు కొన్ని ప్రాంతాల్లోనే సిసి కెమెరాలను ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయక పోవడంతో ఒక వైపు బ్రోకర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటుంటే, మరో వైపు చిల్లర దొంగలు తమ వృత్తి నైపుణ్యాన్ని చూపిస్తూ అక్కడకు వచ్చే వారికి సమస్యలను సృష్టిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిసి కెమెరాలను పార్కింగ్ ప్రాంతం మొదలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం సిసి కెమెరాలను ఆర్టిఏ కార్యాలయంలో మాత్రమే  ఏర్పాటు చేసి చేతులు దులుపు కోవడంతో బ్రోకర్లు, చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు.

ముఖ్యంగా వావానాలను పార్కింగ్ ప్రదేశం, వాహనాలను ఫిట్‌నెస్, వాహనాలను నెంబర్ ప్లేట్లు బిగించే ప్రాంతంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయక పోవడంతో అక్కడకు రవాణా సంబంధిత పనులు నిమిత్తం వచ్చేవారు తమ అమ్యూమైన వస్తువులను కోల్పోతున్నారు. తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న రేబాన్ గ్లాసెస్‌ను పొగొట్టుకున్నట్లు ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ షరీఫ్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఈ కార్యాలయంలో ఏసీబీ అధికారుల పేరుతో కొంత మంది తాము కొంత మంది అక్కడ పని చేస్తున్న మహిళా అధికారిని విచారణ పేరుతో బయటకు తీసుకు వెళ్ళడం,అనంతరం పోలీసులు రంగం ప్రవేశం చేసి నకిలీ ఏసీబీ అధికారులను గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో అక్కడ సీసీ కెమెరాలు పని చేయక పొవడంతో వారు వారిని గుర్తించడం కొంత జాప్యం జరిగింది. అనంతరం అక్కడ అధికారులు సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. రవాణాశాఖలో ఎక్కువగా రద్దీగా ఉండే పార్కింగ్, వాహన ఫిట్‌నెస్, తదిర నె ప్రాంతాల్లో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తే బ్రోకర్ల దందాకు పులిస్టాప్ పెట్టడమే కాకుండా,ఇటు చిల్లర దొంగల నిఘా పెట్టేందుకే కాకుండా బ్రోకర్ల ఆగడాల నుంచి వాహనదారులకు రక్షణ కల్పించడమే కాకుండా సంబంధిత కార్యాలయాలను నిఘా అధికంగా చేసినట్లు అవుతుంద వాహనాదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News