Wednesday, January 22, 2025

సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో స్వామివారికి అలంకరించిన దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలను దింగలించరని, అదేవిధంగా హిల్ కాలనీ డౌన్ పార్క్ వద్ద ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మ వారి పుస్తెలతాడును కూడా అపహరించారని, రెండు దొంగతనాలు ఒకే ముఠా చేసి ఉంటుందని, క్లూస్ టీంను రంగంలోకి దింపామని, ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని, గుడి కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జున సాగర్ టౌన్ ఎస్ఐ.సురేష్ తెలిపారు.

నాగార్జున సాగర్‌లో ప్రధాన ఆలయాల్లో దొంగతనం జరగడం ఇది నాలుగవసారని,ఎన్ని చోరీలు జరుగుతున్న దొంగలు మాత్రం దొరకడం లేదని, నాగార్జున సాగర్‌లో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు నివసిస్తూ ఉంటారు. దొంగతనాలకు అలవాటు పడ్డవారు నివాసాల మీద చేసే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News