- Advertisement -
హైదరాబాద్: రైళ్లలో దొంగతనాలు చేసేవాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి దొంగలు వస్తారా.. అని కొంతమంది భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఎంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేసినా.. ఏదో మూలలో దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ-గోదావరి ఎక్స్‌ప్రెస్‌లె చోరీ జరిగింది. ఎ-1 భోగీలో చొరబడిన దొంగలు 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ జిఆర్‌పి స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -