Sunday, December 22, 2024

వైన్స్‌ షాప్‌లో చోరీ: ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం ఉద్దేమర్రిలో కాల్పులు జరిపి వైన్స్ షాప్ లో దోపిడీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన భరత్ పూర్ ముఠాగా గుర్తించారు. నిందితుల నుంచి రూ 30 వేల నగదు తపంచా, బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అల్వాల్ లో రాజస్థాన్ కు చెందిన అరిఫ్ వ్యక్తి వీరికి ఆశ్రయం కల్పించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరిఫ్ పరారీలో ఉన్నాడు. శామీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రి వైన్ షాప్ లో కాల్పులు జరిపి దోపిడీ పాల్పడిన సంఘటనపై 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. తెలంగాణ , రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం వేతికామని చెప్పారు.

రాజస్థాన్ భరత్ పూర్ కు చెందిన మహ్మద్ ఖాన్, మహ్మద్ టారిఫ్, మహ్మద్ నాసిర్ లను అరెస్ట్ చేసామని వెల్లడించారు. అరిఫ్ ఖాన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. జీతం డబ్బులు సరిపోక దోపిడీలు చేశారన్నారు. తుపాకీ ని అల్వాల్ లో దాచిపెట్టారని చెప్పారు.
బొమ్మల రామారం పరిధిలో కూడా ఈ నిందితులు వ్యవసాయ క్షేత్రాల వద్ద దొంగతనాలు చేశారని డీసీపీ పేర్కొన్నారు. వైన్ షాప్ లో దోపిడీ చేశాక నిందితులు బొమ్మల రామారంలోని గద్దరాల్ల తండాలో తిరిగారని చెప్పారు. అందుకే పోలీసులు తాండకు వెళ్ళి విచారణ చేపట్టామని డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News