Thursday, December 19, 2024

వట్టూరు శివారులో కేబుల్ వైర్ల చోరీ

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: తూప్రాన్ మండల పరిధిలోని వట్టూరు, జెండాపల్లి, పడాలపల్లి గ్రామాల శివార్లలో ఉన్న సుమారు 40 వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి శనివారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు కేబుల్‌వైర్లను, సర్వీస్‌వైర్లను చోరీ చేశారు. వానాకాలంలో వరి పంటల సాగు కోసం పోసుకున్న వరి తుకాలకు నీరందే సమయంలో దొంగలు విలువైన కేబుల్ వైర్లను, సర్వీస్ వైర్లను కత్తిరించుకుని పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆందోళనకు గురవుతున్నారు. పడాలపల్లికి చెందిన పిల్లుట్ల రాజు అనే రైతుకు చెందిన మూడు బోర్ల దగ్గర నుంచి వైర్ల చోరీ జరిగింది. గత రెండు నెలల కాలంలో మూడుసార్లు బోరుబావుల దగ్గర నుంచి వైర్ల దొంగతనాలు జరిగినట్లు రైతులు తెలిపారు.

పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకుడు వట్టూరు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ వరి తుకాలుపోసుకున్న సమయంలో బోరుబావుల దగ్గర నుంచి దొంగలు వైర్లను చోరీ చేయడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని దీనిపై పోలీసులు రెవెన్యూ అధిఆరులు తక్షణమే స్పందించి చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో బాధిత రైతులతో కలిసి మా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని మల్లేశ్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News