- Advertisement -
లక్నో: దొంగలు మాజీ ఎంఎల్‌ఎ ఇంట్లోకి చొరబడి రూ.50 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డింపియర్‌నగర్‌లో మాజీ ఎంఎల్‌ఎ చందన్ సింగ్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్లు గాఢ నిద్రలో ఉన్నపుడు దుండగులు ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. కిచెన్ రూమ్‌లో కిటీకికి ఉన్న గ్రిల్‌ను తొలగించి ఆభరణాలు ఉన్న రూమ్‌లో ప్రవేశించారు. ఇద్దరు దొంగలు బాక్స్‌ను ఎత్తుకెళ్లినట్టు సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. మాజీ ఎంఎల్‌ఎ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: జనగామలో బిజెపి నేత తిరుపతి రెడ్డి అదృశ్యం….
- Advertisement -