Sunday, January 19, 2025

ముస్లింలను అగౌరవపరచడమే వారి లక్ష్యం

- Advertisement -
- Advertisement -

షాహీ ఈద్గా మసీదు సర్వేపై అసదుద్దీన్

మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలను అగౌరవపరచడం కొంత మంది లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. దీనిపై ఓవైసి స్పందించారు. బాబ్రీ మసీదు తీర్పు తర్వాత, ఇది సంఘ్ పరివార్ దుశ్చర్యలకు బలం చేకూరుస్తుందని తాను చెప్పిన విషయాన్ని ఓవైసి గుర్తు చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం అటువంటి వ్యాజ్యాన్ని నిషేధించినప్పటికీ అది జరుగుతూనే ఉందన్నారు. మధుర వివాదం దశాబ్దాల క్రితమే మసీదు కమిటీ, ఆలయ ట్రస్ట్ మధ్య పరస్పర అంగీకారంతో పరిష్కరించబడిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒక కొత్త సమూహం ఈ వివాదాలను రేకెత్తిస్తోందన్నారు. అది కాశీ అయినా, మధుర అయినా, లక్నోలోని తిలే వాలి మసీదు అయినా, అదే గుంపు.

న్యాయస్థానం ముందు వాలుతోందన్నారు. ప్రార్ధనా స్థలాల చట్టం ఇప్పటికీ అమలులో ఉన్నా ఈ బృందం చట్టాన్ని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసిందని విమర్శించారు. జనవరి 9న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారించాల్సి ఉండగా సర్వేకు ఆదేశించాల్సిన తొందరేమిటని అసదుద్దీన్ ప్రశ్నించారు. నిరంతరం ముస్లింలను లక్ష్యంగా చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పుడు ‘ఇవ్వండి, తీసుకోండి’ అని బోధించకండి అని ఆయనన్నారు. ఇకపై చట్టం పట్టింపు లేదని, ముస్లింల గౌరవాన్ని దెబ్బకొట్టడం ఇప్పుడు లక్ష్యంగా మారిందని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News