Monday, December 23, 2024

వాళ్లయి స్కాములు…మావి స్కీములు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగం గా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. తెలంగాణ వైద్యశాఖకు కొత్తగా మరో 466 వాహనాలను ప్రభుత్వం కే టాయించింది. మంగళవారం పీపుల్స్ ప్లాజా వద్ద అమ్మ ఒడి, అంబులె న్స్, పార్థివ దేహాల తరలింపు వాహనాలను సిఎం కెసిఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు, 228 అమ్మఒడి వా హనాలు, 34 పార్థివ దేహాల వాహనాలు ఉన్నాయి. అనంతరం ఆర్టీసి ఉద్యోగులు కలిసి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అంబులెన్సుల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడు తూ అత్యవసర సేవలు అందించే 466 అధునాతన వాహనాలను ఒకే రోజు ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని, తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455 కు పెరిగిందన్నారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. అమ్మ ఒడి ద్వారా రోజుకు 4 వేల మందికి, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని, నియోజక వర్గానికి 100 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, నాలుగు టీమ్స్, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కోనేలా రాష్ట్ర వైద్య రంగం పటిష్టం చేసిందని తెలిపారు. మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసా ప్రజలకు కలిగిందన్నారు. బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు జరిగితే తెలంగాణలో స్కీములు ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో తగవులాటలు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇక నుంచి ప్రభుత్వమే చెల్లిస్తుందని కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు గతంలో అంబులెన్స్ సగటు సమయం 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు 15 నిమిషాలకు తగ్గిందన్నారు. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్‌లో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నామని,108 ఉద్యోగుల వేతనాలు 4 విడుతలుగా పెంచుతున్నామని ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News