Monday, December 23, 2024

మోడీ, యోగీ ఫొటోలతో బీజెపి థీమ్ చీరలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఆకట్టుకోడానికి బీజేపీ థీమ్ చీరలను డిజైన్ చేయించింది. ఆ చీరలపై ప్రధాని మోడీ, సిఎం యోగిల ఫోటోలు, బిజెపి పార్టీ చిహ్నం కమలం ఉన్నాయి. అంతేకాదు ఓ స్లోగన్ కూడా ఇచ్చారు. గుజరాత్ లోని సూరత్‌లో ఆ చీరలను నేశారు. అయోధ్య థీమ్‌తో తయారైన ఆ చీరలను ఈస్ట్రన్, వెస్ట్రన్ యూపీలో ఉండే మహిళా ఓటర్లకు సుమారు వెయ్యి వరకు పంచిపెట్టనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మోడీ బొమ్మ ఉన్న చీరలను తయారు చేశారు. వాటిని 1500 కు ఒకటి వంతున అమ్మారు. జార్ఖండ్‌లో ఆ చీరలకు మంచి డిమాండ్ వచ్చింది.

Theme Sarees with PM and Yogi pics in UP Polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News