Thursday, January 23, 2025

అప్పుడు ఆమోదించి.. ఇప్పుడు లోపాలంటారా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యారేజి డిజైన్లకు కేంద్ర జలసఘం క్లియరెన్స్ ఇచ్చారని ఆమేరకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డతోపాటు అన్నారం , సుందిళ్ల బ్యారేజిల డిజైన్లకు కూడా కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చాకే డి జైన్ల మేరకు వీటి నిర్మాణం జరిగినట్టు వివరించా రు. బ్యారేజిలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు. గతంలో కూడా ఇటువంటివి పలుచోట్ల జరిగాయ ని, 1952లో ప్రకాశం బ్యారేజిపై కూడా ఇలాం టి సమస్య తలెత్తిందని గుర్తు చేశారు. 1975 లో భారత్, బంగ్లా సరిహద్దుల్లో ఉన్న అతిపెద్ద ఫరక్కా బ్యారేజ్ లో కూడా ఇలాంటి లోపాలు గతంలో తలెత్తాయని తెలిపారు.

బ్యారేజిలో నీరు ఉండగా లోపాలు గుర్తించడం కష్టమని తెలిపారు. ఇప్పుడే కాఫర్ డ్యాం నిర్మించి, నీళ్లు మళ్లిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన డ్యామ్‌సేఫ్టి కమిటీకి 3 రోజుల్లో అధ్యయనం, నివేదిక ఇవ్వడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.డీపీఆర్లు, డిజైన్లు అన్నీ కేంద్ర జల సంఘానికి పంపించామని వివరించారు. వాటిని అన్ని విధాల పరిశీలించి సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందన్నారు. మళ్లా ఇప్పుడు నాణ్యత లేదు, డిజైన్లలో లోపాలున్నాయి అనడం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన ఎల్ అండ్ టీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే సంస్థ అని తెలిపారు. లోపాన్ని విశ్లేషించి సవరించడానికి ఎల్ అండ్ టీ కంపెనీ కసరత్తు చేస్తోందన్నారు. మేడిగడ్డ బ్యారేజి ఏడవ బ్లాక్ లో 16 వ గేటు నుంచి 21 వ గేటు వరకు సాంకేతిక లోపాలు ఉన్నాయా అన్న విషయాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News