Friday, November 22, 2024

అప్పుడు వలసల జిల్లా .. ఇప్పుడు ఉపాధికి ఖిల్లా

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు అనగానే వలసలకు, నిరక్షరాస్యతకు, పే దరికానికి కేరాఫ్ అడ్రస్ అనేలా ఉండేదని అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఉపాధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. స్థానిక యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి లే కుండా చూస్తామని అందులో భాగంగా తీసుకువచ్చిన ఐటీ టవర్‌లో ఐటీ కొలువులను స్థానిక యు వతకు దక్కేలా ఈ జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు.

మహబూబ్‌నగర్ శిల్పారామంలో బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జా బ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. 650 మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఈ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపా రు. సెప్టెంబర్ 2న నిర్వహించే మెగా జాబ్ మే ళాలో జిల్లాలోని 10వేల మందికి ఉద్యోగ అవకాశా లు కల్పిస్తామన్నారు. పాలమూరు అంటేనే లేబర్ అనేలా ప్రపంచమంతా పేరు వచ్చిందని … ఎక్కడ నిర్మాణ పనులు జరిగినా పాలమూరు లేబరే కనిపించేవారని మంత్రి అన్నారు.

ఆకలి చావులు ఉం డేవని, అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇలాంటి ఇబ్బందులు అన్నిటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత మహబూబ్‌నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రా ధాన్యత ఇస్తున్నామన్నారు.

సెప్టెంబర్ 2న 100 కంపెనీలతో 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధం గా మరో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం నాటి జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం రానివారు తిరిగి సెప్టెంబర్ 2న నిర్వహి ంచే జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన కో రా రు. జాబ్ మేళాకు హాజరైన వారందరి వివరాల ను సేకరించి సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆ యన ఆదేశించారు.

మహబూబ్‌నగర్ ఐటి టవర్ లో దేశంలోనే అతి పెద్దదైన ఎనర్జీ పార్కును ఏర్పా టు చేస్తున్నామని, అమరరాజా లీథియం గిగా సెల్ పరిశ్రమ ద్వారా 10వేలమందికి స్థానికంగానే యు వతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాలలో అర్బన్ ఎకో పార్కును ఏర్పాటు చేశామని, త్వరలోనే 26వే ల ఎకరాల్లో జంగిల్ సఫారీ ప్రారంభించనున్నామ ని తెలిపారు. హన్వాడలో ఫుడ్ పార్క్ రానుందని, మినీ ట్యాంక్ బండ్ , సస్పన్షన్ బ్రిడ్జి, ఐలాండ్ , ఏసిబోట్ ఏర్పాటు చేస్తున్నామని, శిల్పారామం ఆ వరణలో అతి పెద్ద వండర్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

జిల్లా ఎస్పీ కె. నర్సిం హ , టాస్క్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే సి నర్సిములు , ముడా చైర్మన్ గంజి వెంకన్న, గో పాల్ యాదవ్, రాజేశ్వర్‌గౌడ్, గణేష్, అబ్దుల్ రహమాన్ , గిరిధర్‌రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, వేణుగోపాల్ , రాములు, ఆర్డీఓ అనిల్‌కుమార్, ఇంచార్జీ అడిషనల్ కలెక్టర్ యాదయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News