Sunday, January 19, 2025

ఆగస్టులో 14 రోజులు బ్యాంక్ సెలవులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. వచ్చే వారం బ్యాంకులకు సుమారు 14 రోజులు సెలవులు వస్తున్నాయి. కావున ప్రజలు బ్యాంకు పనులు ఉంటే ముందుగానే చేసుకోవడం ఉత్తమం, ఎందుకంటే అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం నుంచి డబ్బు డిపాజిట్ చేయడం, పాత నోట్లు మార్చడం తదితరాల వరకు బ్యాంకుకు వెళ్లాల్సిందే. అందువల్ల ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి ఏడాది సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. పండుగలు, జన్మదినోత్సవాలు, శని, ఆదివారాల కారణంగా చాలా రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు ఓనం, రక్షా బంధన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవుల జాబితా..
ఆగస్టు 6న ఆదివారం కారణంగా సెలవు, ఆగస్ట్ 8న రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్‌టక్‌లోని టెండాంగ్ ల్హో సెలవు, ఆగస్టు 12న రెండో శనివారం, ఆగస్టు 13న- ఆదివారం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న- పార్సీ నూతన సంవత్సరం, ఆగస్టు 18న- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి, ఆగస్టు 20న- ఆదివారం, ఆగస్టు 26న నాలుగో శనివారం, ఆగస్టు 27న- ఆదివారం, ఆగస్టు 28న- మొదటి ఓనం, ఆగస్టు 29న తిరుఓణం, ఆగస్టు 30న- రక్షా బంధన్ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News