Friday, November 15, 2024

హుజురాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -
There are 30 candidates in Huzurabad ring
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. బుధవారం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ కోసం మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం ఉపయోగించనుంది.

నామినేషన్ ఉపసంహరించుకున్న ఈటల జమున

హుజురాబాద్ బిజెపి పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లింగారెడ్డి కూడా నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సుమన్, వినోద్ కుమార్, మల్లిఖార్జున్, నూర్జహాన్ బేగం తదితరులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News