Saturday, November 23, 2024

పాక్‌జైళ్లలో 54 మంది సైనికాధికారులు

- Advertisement -
- Advertisement -

There are 54 military officers in Pakistani jails

కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : పాక్‌జైళ్లల్లో మగ్గుతోన్న 54 మంది భారతీయ సైనికాధికారుల పరిస్థితిపై కేంద్రం వివరణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 1971 భారత్ పాక్ యుద్ధం నాటి నుంచి వీరు యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో పలు కేడర్ల వారు ఉన్నారు. నిర్బంధంలో ఉన్న మేజర్ కన్వల్జిత్ సింగ్ భార్య జస్బిర్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్పందించింది. పలువురు యుద్ధ ఖైదీలతో పాటు కన్వల్జిత సింగ్ జైలులో ఉన్నారు. ఆయన అతీగతి తెలియని స్థితి ఉంది. దీనిపై ఆమె పెట్టుకున్న పిటిషన్‌లోని హృదయవిదారక అంశాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై కేంద్రం ఏమి చేసింది? ఎటువంటి చర్యలకు దిగుతున్నారు? అనేది తెలియచేయాలని వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. యుద్ధ ఖైదీల హక్కుల పరిరక్షణకు దేశీయ అంతర్జాతీయ నిర్థిష్ట ఏర్పాట్లు అవసరం అని పిటిషన్‌లో తెలిపారు.

క్యాప్టెన్ సౌరభ్ కాలియా, జాట్ రెజిమెంట్‌కు చెందిన నలుగురు సిపాయిల వధ వారి భౌతిక కాయాలను పాకిస్థాన్ భారత్‌కు పంపించడం వంటి అంశాలను పిటిషనర్ ప్రస్తావించారు. కేంద్రం స్పందనకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్గిల్ వార్ సమయంలో సౌరభ్ యుద్ధ ఖైదీగా పాకిస్థాన్ జైలు పాలయ్యాడు. అప్పటికి సౌరభ్ వయస్సు 22 ఏండ్లు. తరువాత శవంగానే ఇంటికి చేరుకోవల్సి వచ్చింది. ఈ అన్ని అంశాల వ్యాజ్యం చాలా కీలకం అయినది. మానవీయ కోణాలు ఇమిడి ఉన్నది అని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. మూడువారాల తరువాత విచారణకు తేదీని ఖరారు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News