Saturday, November 23, 2024

భారత్‌లో 6.2 కోట్ల వీధి కుక్కలు

- Advertisement -
- Advertisement -

There are about 6.2 crore stray dogs in India

91 లక్షల వీధి పిల్లులు

న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 6.2 కోట్ల వీధి కుక్కలు, 91 లక్షల వీధి పిల్లులు ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. దేశ జనభాలో 77 శాతం మంది ప్రజలు వారానికి ఒక్కసారైనా వీధి కుక్కను చూస్తున్నట్లు తెలిపారని కూడా ఆ నివేదిక పేర్కొంది.
భారత్‌లోని పెంపుడు జంతువులకు ఇల్లు లేని సూచీ పెంపుడు జంతువులు కావాలనే స్కోరును దిగజార్చింది. 10 పాయింట్ల స్కేలులో భారత్ 2.4 స్కోరు చేసింది. కొత్త సూచీ ప్రకారం దేశంలో దాదాపు 8 కోట్ల ఇల్లులేని పిల్లులు, కుక్కలు ఉన్నాయి. వాటిలో 6.2 కోట్ల వీధి కుక్కలు, 91 లక్షల వీధి పిల్లులూ ఉన్నాయి. అంతేకాక 88 లక్షల వీధి కుక్కలకు, పిల్లులకు ఆశ్రయం కల్పించే కేంద్రాలున్నాయని కూడా కొత్త నివేదిక పేర్కొంది. సాధారణ జనాభాలో 61 శాతం మంది కుక్కలు, పిల్లులు పెంచుకోవడానికి ఇష్టపడ్డంలేదని కూడా తేలింది. పీపుల్ ఫర్ యానిమల్స్(పిఎఫ్‌ఎ) అనే ప్రభుత్వేతర సంస్థకు చెందిన గౌరీ ములేఖి ఈ అంశంపై మాట్లాడుతూ భారత దేశంలో ప్రతి 100 మందికి కనీసం మూడు వీధి కుక్కలున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక నివాసవసతి లేని జంతువుల సంఖయ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News