Sunday, January 19, 2025

జల రంగంలో స్టార్టప్‌లు అన్వేషణకు అవకాశాలు పుష్కలం

- Advertisement -
- Advertisement -
తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి టెస్టింగ్ ల్యాబ్ ఉన్నాయి
మన నీటిని అతి తక్కువ ఉత్పాదకతగా పరిగణిస్తారు
నీటి రంగంలో 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడికి ప్రభుత్వం సిద్దం
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడి

హైదరాబాద్ : దేశంలో నీటి రంగంలో స్టార్టప్‌లు అన్వేషించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని టి-హబ్‌లో జిటో ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జెఐఐఎఫ్) రెండు రోజుల పెట్టుబడిదారుల సమ్మేళనం వ్యవస్థాపకుల దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జనాదరణ పొందడమే కాకుండా, దేశీయ పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయ రంగం భారతదేశంలో ఎక్కువ నీటిని వినియోగిస్తుందని దేశంలోని వార్షిక మంచినీటి ఉపసంహరణల 771,000 బిలియన్ లీటర్లలో ఉందన్నారు. ఇది దాదాపు 90% వాటాను కలిగి ఉందని వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం సంవత్సరానికి 4,913 నుండి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందన్నారు. ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు. మన నీరు తక్కువ ఉత్పాదకతగా పరిగణించబడుతుందని, వ్యవసాయంలో వినియోగించే నీటిని పొదుపు చేయడానికి భారతదేశం ఎటువంటి డబ్బు ఖర్చు చేయడం లేదన్నారు. పరిశ్రమ వినియోగ రంగాలలో నీటి సంరక్షణ జరుగుతుందని, ఈ రెండు దేశం నీటిలో 5 శాతం కంటే తక్కువ వినియోగిస్తాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఇక్కడే మాకు ప్రైవేట్ రంగ సహాయం కావాలని ఇక్కడే మనకు స్టార్టప్‌లు అవసరమైతాయని ఖచ్చితమైన వ్యవసాయంలో సహాయం చేయడానికి మనకు స్టార్టప్‌లు అవసరం ఉందని వ్యవసాయ రంగానికి నీటిని ఆదా చేయడంలో మాకు వారి జోక్యం అవసరమని వెల్లడించారు.

ప్రెసిషన్ వ్యవసాయం అనగా పంట దిగుబడిని మెరుగుపరచడం నిర్వహణకు సహాయం చేయడం హై-టెక్నాలజీ సెన్సార్ విశ్లేషణ సాధనాలను ఉపయోగించి నీటి సంరక్షణతో వ్యవహరించడమని చెప్పారు. ఉత్పత్తిని పెంచడం, శ్రమ సమయాన్ని తగ్గించడం ఎరువులు నీటిపారుదల ప్రక్రియల సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడమనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న భావన అన్నారు. మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యాపార నమూనాను అభివృద్ధి చేయడానికి స్టార్టప్‌ల కోసం మంత్రిత్వ శాఖ కూడా చూస్తోందన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం భూగర్భ జలాల రీఛార్జ్‌లో రీసైకిల్ చేయబడిన వ్యర్థ జలాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ప్రాంతంలో కూడా స్టార్టప్‌లు పెద్ద పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా రక్త పరీక్షకు వెళ్లాలనుకుంటే, ఎక్కడికి వెళ్లాలో తెలుసుందని, రక్తాన్ని సులువుగా పరీక్షించే సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ త్రాగే నీటి నాణ్యతను పరీక్షించడానికి ఎక్కడికి వెళ్లాలో ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. దేశంలో దాదాపు 2వేల ఎన్‌ఏబిఎల్ గుర్తింపు పొందిన నీటి పరీక్ష ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, . నీటి పరీక్షలు కాలిబ్రేషన్ లాబొరేటరీస్ కోసం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ప్రతి జిల్లాలో ఒక పరీక్ష సౌకర్యం ఉండాలనేది మా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. వీటిలో కాఠిన్యం, పిహెచ్, కాపర్, ఐరన్, ఫాస్ఫేట్, క్లోరిన్, అమ్మోనియా, క్రోమియం వంటి 12 పారామీటర్లపైనీటి నాణ్యత పరీక్షలు జరిగే విధంగా చేస్తామని చెప్పారు.

అంతే గాకుండా ఫీల్ ఉపయోగం కోసం ఫీల్ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లు మాకు సహాయపడ్డాయి. ఇందులో 19 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 1.5 కోట్ల నమూనాలను సేకరించి పరీక్షించామని వెల్లడించారు. సెన్సార్ ఆధారిత తాగునీటి పరీక్ష కోసం పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం హ్యాకథాన్‌లను కూడా నిర్వహించినట్లు 250 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా 20 షార్ట్-లిస్ట్ చేసినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం నీటి రంగంలో 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. అలాగే భూగర్భజల స్థాయిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు, నదుల పునరుజ్జీవనం, నదుల అనుసంధానం ప్రపంచంలోని ఎన్నో అతిపెద్ద ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొన్నారు. నీటిని సంరక్షించడం, హార్వెస్టింగ్ చేయడం, హేతుబద్ధంగా ఉపయోగించడం, నీటిని రీసైక్లింగ్ చేయడం అనే సందేశం దేశమంతటా వ్యాపింపజేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News