Thursday, January 23, 2025

మా పార్టీలోనూ కోవర్టులు ఉన్నారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సునామీ రాబోతుంది
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్‌లో ఎంత మంది కోవర్టులు ఉన్నారో తమకు తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీలో కూడా కోవర్టులు ఉన్నారని, వారి పార్టీలోనూ కోవర్టులు ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సునామీ రాబోతుందని ఆమె జోస్యం చెప్పారు. పువ్వాడ అజయ్ ఓటమి భయంతో తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పువ్వాడ అజయ్ పాముకు పాలు పోస్తే కాటు వేసే రకమని ఆమె విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రచారం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News