Sunday, January 19, 2025

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేకరైళ్లను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది. రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్య ప్రతి శనివారం 2023 ఆగష్టు 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రైలు నెంబర్ 07054 బికనీర్ నుంచి కాచిగూడల మధ్య ప్రతి మంగళవారం 2023 జూలై 4 నుంచి ఆగష్టు 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 03245 దానాపూర్ నుంచి బెంగళూరు మధ్య ప్రతి బుధవారం 2023 ఆగష్టు 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 03246 బెంగళూరు నుంచి దానాపూర్ మధ్య ప్రతి శుక్రవారం 2023 ఆగష్టు 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం నుంచి బెంగళూరుల మధ్య
రైలు నెంబర్ 08543 విశాఖపట్నం నుంచి బెంగళూరు, కంటోన్మెంట్‌ల మధ్య ప్రతి ఆదివారం 2023 జూలై 30 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని, రైలు నెంబర్ 08544 బెంగళూరు, కంటోన్మెంట్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రతి సోమవారం 2023 జూలై 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రైలు నెంబర్ 07195 కాజీపేట్ నుంచి దాదర్ మధ్య ప్రతి బుధవారం 2023 జూలై 5 నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు, రైలు నెంబర్ 07196 దాదర్ నుంచి కాజీపేట్ మధ్య ప్రతి గురువారం 2023 జూలై 6వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
కాజీపేట్ నుంచి దాదర్ మధ్య
రైలు నెంబర్ 07197 కాజీపేట్ నుంచి దాదర్ మధ్య ప్రతి శనివారం ఆగష్టు 26వ తేదీ వరకు రైలు అందుబాటులో ఉంటుందని, రైలు నెంబర్ 07198 దాదర్ నుంచి కాజీపేట్ మధ్య ప్రతి ఆదివారం 2023 ఆగష్టు 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
రైలు నెంబర్ 07637 తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ మధ్య ప్రతి ఆదివారం ఆగష్టు 27వ తేదీ వరకు రైలు నెంబర్ 07638 సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతి మధ్య ప్రతి సోమవారం ఆగష్టు 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టీ మధ్య
రైలు నెంబర్ 07426 హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టీ మధ్య ప్రతి సోమవారం ఆగష్టు 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07427 హెచ్‌ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ మధ్య ప్రతి మంగళవారం ఆగష్టు 29వ తేదీ వరకు అందు బాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07428 హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టీ మధ్య ప్రతి బుధవారం జూలై 5వ తేదీ నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైలు నెంబర్ 07429 హెచ్‌ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ మధ్య ప్రతి గురువారం 2023 జూలై 6 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, రైలు నెంబర్ 07003 హైదరాబాద్ నుంచి సోలాపూర్ మధ్య ప్రతి రోజు జూలై 6వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, రైలు నెంబర్ 07004 సోలాపూర్ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతి రోజు ఆగష్టు 31వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News