Monday, December 23, 2024

మా అమ్ముల పొదిలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు

- Advertisement -
- Advertisement -

మరిన్ని ప్రజాకర్షక అస్త్రాలతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవడం ఖాయం-
అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి హరీష్ రావు చిట్ చాట్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాత్మక వ్యవహారశైలితో ప్రతిపక్షాలు ఖంగు తినడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అమ్ములపొదిలో అస్త్రాలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అస్త్రాలు వదలడం ఖాయం అన్నారు. ప్రభుత్వం వెలువరిస్తున్న సంచలన నిర్ణయాలతో విపక్షాలకు ఊపిరి ఆడడం లేదన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తక్కువ అంచనా వెయ్యద్దని హరీశ్ రావు అన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బిఆర్‌ఎస్‌ను తట్టుకోవడం ప్రతిపక్షాల వల్ల కాదని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలకు రాబోయే రోజుల్లో విపక్షాలు విలవిలలాడటం ఖాయం అని అభిప్రాయపడ్డారు.

4 లక్షల పై చిలుకు గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంచడంతో తండాల్లో బిఆర్‌ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని అన్నారు. పట్టాలతో పాటు రైతుబంధు, రైతుబీమా కూడా వరిస్తుడటంతో గిరిజన గ్రామాల్లో బిఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇక విఆర్‌ఎల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం లాంటి నిర్ణయాలు ప్రజల్లో కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ ఇమేజ్ ను మరింత పెంచాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా పంట రుణమాఫీకి కూడా అనుమతి ఇవ్వడంతో ఇక ప్రభుత్వానికి తిరుగులేకుండా పోయిందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో కెసిఆర్ అమ్ములపొదిలో నుంచి మరిన్ని ప్రజాకర్షక అస్త్రాలు రావడం తథ్యం అన్నారు. ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలోనే పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు, వాళ్లకు ఇంటరిమ్ రిలీఫ్‌ను కూడా ప్రకటించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News