ముంబై : ముంబైలో పెద్ద మురికి వాడగా పేర్కొనే ధారవి ఏరియాలో తాజాగా ఏ ఒక్క కరోనా కేసు కూడా శనివారం నమోదు కాలేదని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి)వెల్లడించింది. గత 15 రోజుల్లో అయిదు రోజులుగా తాజా కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 6993 కరోనా కేసులు ఉన్నాయి. ఆగస్టు 3,8,11,12 తేదీల్లో ఏ ఒక్క కేసు స్థానికంగా నమోదు కాలేదు. ధారవిలోని మొత్తం కేసుల్లో 6596 మంది కరోనా రోగులు కోలుకున్నారు. 11 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధారవి మురికి వాడ కరోనా హాట్‌స్పాట్‌గా ఉండేది. కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 2.5 చదరపు కిమీ విస్తీర్ణం కలిగిన ధారవి మురికి వాడ జనాభా 6.5 లక్షల మంది. ఇక్కడ ప్రజలంతా దగ్గరదగ్గరగా గుడిసెల్లో ఉంటుంటారు. సూక్ష్మపరిశ్రమల యూనిట్లు కూడా ఇక్కడ ఎక్కువే.
ముంబై ధారవిలో కరోనా తాజా కేసులేవీ లేవు
- Advertisement -
- Advertisement -
- Advertisement -