Wednesday, January 22, 2025

‘వానాకాలం పంటలు’ రైతుల ఇష్టం

- Advertisement -
- Advertisement -

There are no restrictions on Paddy:Minister Singireddy Niranjan Reddy

వరిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

లాభసాటి పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి

మన : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. గురువా రం మంత్రి మాట్లాడుతూ కొందరు రైతు లు మాత్రం ప్రభుత్వ సూచనలను అర్థం చేసుకుని ఇతర పంటల సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు పంటతో మా ర్కెట్‌కు వెళ్లకుండా, కల్లం వద్దకే మార్కెట్ వె ళ్లాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. వరిసాగుపై చేసే సూచనలు ఆంక్షలు కాదని, లాభసాటి పంటలు వేయాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. బియ్యం కాకుండా వడ్లు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. కొందరు కురచబుద్దితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని చూస్తున్నారని, అలాంటి వారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు. యాసంగిలో రాష్ట్రంలో పండే వరి ధాన్యం నుంచే ఎక్కువ నూకలు వస్తాయని మొదటి నుంచి చెబుతున్నాం.

కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బియ్యంతో సంబంధం లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. యాసంగిలో తెలంగాణ నుంచి వచ్చే వడ్లు కొనం అని కేంద్రం స్పష్టంగా చెబుతున్నది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇదే విషయం చెప్పారు . వానాకాలం ఎవరి ఇష్టం వారిది .. ఈ విషయంలో ఆంక్షలు లేవు . వరికి మించి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది కేంద్రం క్వింటాలు పత్తికి రూ.5726 నుంచి గరిష్టంగా రూ.6025 ధర ప్రకటించింది. కానీ పత్తికి క్వింటాలు రూ.8 వేల నుండి రూ.12 వేలకు పైగా బహిరంగ మార్కెట్లో ధర లభించింది. పెసలు మద్దతు ధర క్వింటాలుకు రూ.7275 ఉండగా అంతకుమించి రూ.7600 వరకు, కందులు క్వింటాలుకు రూ.6300 మద్దతుధర కాగా రూ.6700 వరకు, మినుములు రూ.6300 మద్దతుధర కాగా రూ.6500 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. వేరుశెనగ క్వింటాలుకు రూ.5550 మద్దతుధర కాగా రూ.8 వేలపై చిలుకు ధర లభించిందన్నారు.

వరి సాగుకు మించి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి, తక్కువ పంటకాలంలో రైతులకు ఎక్కువ లాభం కళ్ల ముందు కనిపిస్తున్నదికాబట్టి రైతులను ఈ దిశగా ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గతేడాది రైతులు పత్తి వేయక నష్టపోయారు. అందుకే ఈ సారి వారిని పత్తి వేయాలని కోరుతున్నాం. కంది సాగుతో భూసారం పెరగడమే కాకుండా తక్కువ పెట్టుబడి, నీటి ఎద్దడిని తట్టుకుని 4 నుంచి 6 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్నారు. కనీస మద్దతుధరకు మించి నువ్వులు, శెనగలు, పత్తి, వేరుశెనగ, కందులు, మినుములు బహిరంగ మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. వ్యవసాయ రంగం బలోపేతంతో గ్రామాలు బలపడతాయని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News