Monday, December 23, 2024

మూడు రకాల వందేభారత్ రైళ్లు.. జూన్ మధ్యలో ప్రతిరాష్ట్రానికి ఈ రైలు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : జూన్ మధ్యనాటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. ఉత్తరాఖండ్‌కు ఈ రైలు ప్రారంభం దశలో ఆయన మాట్లాడారు, మూడు రకాల వందేభారత్ రైళ్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నాటికి ప్రవేశపెడుతారని వివరించారు. ఇప్పుడున్న శతాబ్థి, రాజధాని , లోకల్ ట్రైన్ల స్థానంలో దేశీయ సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లు నడుస్తాయి.

మూడు రకాల వందేభారత్‌లు ఉంటాయని తెలిపిన మంత్రి వంద కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు వందే మెట్రోలు, 100 నుంచి 550 కిలోమీటర్ల లోపు దూరాలకు వందే ఛైర్‌కార్స్, 550 కిమీల నుంచి ప్రయాణాలకు వందేస్లీపర్స్ అందుబాటులోకి తెస్తారని వివరించారు. వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు ఉండేలా స్థాయిని పెంచుతారని తెలిపారు. ప్రతి రాష్ట్రానికి ఓ వందేభారత్ వచ్చేందుకు వీలుగా ఈ రైళ్ల తయారీ సామర్థం పెంచుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఎనిమిది లేదా తొమ్మిదిరోజులకు ఓ వందేభారత్ రైలుఫ్యాక్టరీ నుంచి వస్తోంది.

మరో రెండు ఫ్యాక్టరీలలో పని ఆరంభం కానుంది. త్వరలోనే ఎక్కువగా వందేభారత్‌లు అందుబాటులోకి వస్తే ప్రతిరాష్ట్రంలో దీనిని ప్రవేశపెట్టవచ్చు. వందేభారత్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో సాగే శక్తితో నిర్మించారు. అయితే రైలు పట్టాల సామర్థం ఇతర అంశాలతో దీనిని ఇప్పుడు కేవలం 130 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దేశంలో రైల్వే ట్రాక్‌లు ఇప్పుడు కేవలం గంటకు 70 నుంచి 80 కిమీల వేగం రైళ్లతోనే మనగలిగే విధంగా ఉన్నాయి. వీటిని గంటకు 130 కిమీల నుంచి 160 కిమీల స్థాయిని తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా 35000 కిలోమీటర్ల రైలు ట్రాక్‌ను పటిష్టం చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News