Monday, January 20, 2025

నీరజ్ హత్యకేసులో మరో ఇద్దురు నిందితులు

- Advertisement -
- Advertisement -

There are two other accused in Neeraj murder case

హైదరాబాద్: సంచలనం సృష్టించిన బేగం బజార్ నీరజ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితులు అభినందన్, మహేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మహేశ్, నాందేడ్ లో అభినందన్ ను పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. మంగళవారం నిందితులకు వైద్య పరీక్షల తర్వాత రిమాండ్ కు తరలించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని షాహినాయత్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టయిన నలుగురిని 7 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు. పోలీసుల కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరిగే అవకాశముంది. ప్రేమ, పెళ్లి వ్యవహారమే నీరజ్ హత్యకు కారణమని విచారలో తెలింది. పరువుకోసమే హత్యచేశామని నిందితులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News