Sunday, December 22, 2024

ప్రతి కార్యకర్త కుటుంబానికి ‘బిఆర్‌ఎస్ ’ అండ

- Advertisement -
- Advertisement -

రేగొండ:ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని బిఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు కొలేపాక బిక్షపతి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డిలు అన్నారు. మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త పురుషోత్తం రవి అనారోగ్యానికి గురి కాగా వారి వైద్య ఖర్చుల నిమిత్తం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతుల ఆదేశానుసారం బిఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు కోలెపాక బిక్షపతి, పిఏసిఎస్ వైస్ చైర్మన్‌లు ఇరువురిని కలిసి వారికి రూ.5000వేల ఆరి ్థకసాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రవి ఆరోగ్యం మెరుగు అయ్యేందుకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. రేగొండ ఎంపిటిసి మైస సుమలత బిక్షపతి, బిసి సెల్ యూత్ నాయకులు ఎడ్ల అనిష్‌రెడ్డి, తాళ్లపల్లి చింటూ గౌడ్, మండల బిసి సెల్ ఉపాధ్యక్షుడు గుంటోజు కిషన్, గుంటోజు రాజయ్య, కోలేపాక అంజి, డార్విన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News